అదేపనిగా కళ్లు నులిమితే..ఏమవుతుంది?
అదేపనిగా కళ్లు నులిమితే..ఏమవుతుంది? |
కెరటోకోనస్ అంటే ?
కనుగుడ్డు మీద రక్షణగా ఉండే తెల్లని 'కార్నియా' సహజమైన అద్దంలా పనిచేసి కంటి దృశ్యాలను కంటిలోని రెటీనా మీద పడేలా చేస్తుంది. పదేపదే కంటిని నులమటం వల్ల కార్నియా పొర పల్చబడి లోపలి నుంచి బయటికి తోసుకువస్తుంది. దీన్నే 'కెరటోకోనస్' అంటారు. ఇది సాధారణంగా 20, 30 ఏళ్ల వయసులో వస్తుంది. కనుక ఈ వయసు వారికి చూపు మసకగా ఉంటే వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కార్నియా లోపలిపొర దెబ్బతిని చూపు తగ్గిపోతుంది. జన్యుపరమైన అంశాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.
నిర్ధారణ, చికిత్స
'టోపోగ్రఫీ', 'కెరటోమెట్రీ' అనే పరీక్ష సాయంతో కెరటోకోనస్ నిర్ధారణ చేయవచ్చు. అలర్జీ మూలంగా కళ్ళు నులుముకుని వారికి వైద్యులు తగిన చికిత్స చేసి కళ్లద్దాలు ఇస్తారు. కార్నియా మరీ బయటికి వచ్చినప్పుడు మాత్రం శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుంది. గతానికి భిన్నంగా కొద్ది భాగం కార్నియా మార్పిడి చేసే 'డీఎల్‌కేపీ' తరహా ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే.. కెరటోకోనస్ మరింతగా ముదరకుండా 'కొలాజెన్ క్రాస్‌లింకింగ్' అనే విధానం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కళ్లు పొడి బారకుండా చూసేందుకు, అలర్జీ కారకాలను బయటకు పంపించేందుకు 'ఆర్టిఫిషియల్ టియర్స్' వంటి చుక్కల మందులు ఇస్తారు. అప్పటికీ ఫలితం లేకపోతే కను రెప్పల కింద స్టీరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. వాపు మరీ ఎక్కువగా ఉంటే వైద్యులు చుక్కల మందూ సిఫారసు చేస్తారు.
నివారణే మేలు
కంటికి సంబంధించిన ఎలాంటి అలర్జీ ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చికిత్స తీసుకోవాలి. దుమ్ము, ధూళి, కాలుష్యం పొగ వంటి కారణాల వల్ల కళ్ళు నులుముకుని వారు వాటికి దూరంగా ఉండాలి. వీరు ఇల్లు దులిపినప్పుడు దూరంగా ఉండాలి. మరి కొందరికి తవిటి పురుగు (డస్ట్‌మైట్స్), పుప్పొడి, కుక్క-పిల్లివంటి జంతువుల బొచ్చు, పత్తి.. దూది వంటి ధూళి కణాలు, కొన్ని రకాల రసాయనాలు సమస్యకు కారణంగా ఉంటాయి. వీరు పై వాటికి పూర్తిగా దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. పై సామ్యాల వల్ల కళ్ళు దురదపెడితే ఐసు, లేదా చల్లటి నీటితో కళ్లను తుడుచుకోవటం మంచిది.
No comments:
Post a Comment