అవగాహనే అసలైన అస్త్రం
అవగాహనే అసలైన అస్త్రం
|
లక్షణాలు
ఆరోగ్యవంతుల్లో హెచ్‌ఐవి క్రిములు ప్రవేశించిన 5-10 ఏళ్ళ వరకు సాధారణంగా ఏ లక్షణాలూ ఉండవు. రోగ నిరోధక శక్తి పెరిగే కొద్దీ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కొన్ని వారాలనుంచి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఇతర వ్యాధుల్లో కూడా కనిపించే ఈ లక్షణాలను చూసి హెచ్‌ఐవి అని తెలుసుకొనే అవకాశం చాలా తక్కువ. ఇందుకోసం పరీక్షలను ఆశ్రయించాల్సిందే. సాధారణంగా శరీరంలోని క్రిములు కొన్ని నెలలపాటు నిద్రాణంగా ఉంటాయి. ఆ సమయంలో పరీక్షలు చేయించినా పరీక్షలో తెలియకపోవచ్చు. కానీ ఈ సమయంలో వారి ద్వారా ఇతరులకు ఇది వ్యాపించే ముప్పు ఉంటుంది. హెచ్‌ఐవి క్రిములతో పోరాడటానికి శరీరపు రోగ నిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ను తయారు చేయటం మొదలైన తర్వాతే పరీక్షలో హెచ్‌ఐవి పాజిటివ్ అని తెలుస్తుంది.
వ్యాప్తి
విచ్చలవిడి లైంగిక సంబంధాలు, మాదక ద్రవ్యాలవంటి వాటిని తీసుకో వడానికి పలువురు ఒకే సిరంజిని, సూదిని వాడటం మూలంగా, అసురక్షితమైన విధానంలో జరిగే రక్తమార్పిడి, తల్లి నుంచి కడుపులోని బిడ్డకు కూడా సంక్రమించొచ్చు. సర్జరీ వేళ వాడే పరికరాలు శుద్ధి చేయకపోయినా ఇది సోకే ముప్పు ఉంటుంది.
హెచ్‌ఐవి బాధితుడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా, పైపైన ముద్దు పెట్టుకున్నా, ఒకే మూత్రశాలను వాడుకున్నాఇది వ్యాప్తి చెందదు. తుమ్ములు, దగ్గు, ఇంట్లో వస్తువులను కలిసి ఉపయోగించుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. దోమ కాటు, కలిసి తినటం, తాగటం, కలిసి పనిచేయటం, నివసించటం వల్ల హెచ్.ఐ.వి.వ్యాపించదు.
నివారణ
విచ్చలవిడి శృంగారం, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు పనికిరావు. జీవిత భాగస్వామితోనే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి.
ఎప్పుడైనా రక్తం ఎక్కించాల్సి వస్తే, గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంకుల నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి.
క్షౌరశాలలో ప్రతిసారీ కొత్త బ్లేడు వాడాలి.
సుఖవ్యాధుల లక్షణాలు కనిపిస్తే హెచ్.ఐ.పరీక్షలు చేయించుకోవాలి.
చికిత్స
పరీక్షల ద్వారా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఏ మేరకు దెబ్బతిన్నదీ తెలుసుకోవచ్చు. బాధితులు వైద్యులు సూచించిన విధంగా ఎఆర్‌టి మందులను వాడుకోవాలి. అలాగే.. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, ధ్యానం, యోగాసనాలు చేయడం, వేళకు మంచి ఆహారం తీసుకోవడం, కనీస వ్యాయామం చేయడం, క్షయ, సుఖ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటివాటికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించటం ద్వారా బాధితులు ఇతరులవలే పూర్తి సాధారణ జీవితాన్ని పొందవచ్చు. హెచ్‌ఐవి ఉన్న గర్భిణి లేదా బాలింతకు 28 వారాలపాటు యాంటి రిట్రోవైరల్ మందులు ఇవ్వడం వల్ల చిన్నారులకు హెచ్‌ఐవి సంక్రమించకుండా చూసుకోవచ్చు.
No comments:
Post a Comment