మెరుగైన చికిత్సతోనే సుఖవ్యాధుల నియంత్రణ
మెరుగైన చికిత్సతోనే సుఖవ్యాధుల నియంత్రణ |
హెర్పిస్
లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు 'హెర్పిస్ సింప్లెక్స్ -2' అనే వైరస్ సంక్రమించి హెర్పిస్ కు దారితీస్తుంది. ఇది సోకిన తొలినాళ్లలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం, ఒంటి నొప్పులు, గజ్జలు, చంకలలో గడ్డలు కనిపిస్తాయి. మాలి దశలో జననాంగాలపై చిన్న చిన్న నీటిపొక్కులు ఏర్పడి, రెండు మూడు రోజుల్లోనే పగిలి రసిక కారుతుంది. ఈ సమయంలో లైంగిక చర్యలో పాల్గొంటే రెండో వారికీ హెర్పిస్ సంక్రమిస్తుంది. స్త్రీలలో ఈ సమస్య గర్భస్రావానికి, పురుషుల్లో ఆందోళన, అంగస్తంభనలకు దారితీస్తుంది. చర్మ సమస్యలూ కనిపిస్తాయి. హెచ్‌ఐవీ బాధితుల్లో హెర్పిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై లక్షణాలతో బాటు హెచ్‌ఎస్‌వీ 1, 2 పరీక్షల వంటి మరికొన్ని పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారిస్తారు.
హెచ్‌ఐవీ
లైంగిక చర్య, రక్తమార్పిడి, తల్లి నుంచి బిడ్డకు వైరస్ వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ అక్వైర్డ్ ఇమ్యునో డెఫీషియన్సీ సిండ్రోమ్ అనే పరిస్థితికి తీసుకుని వస్తుంది. హెచ్‌ఐవీ వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఏ లక్షణాలూ కనబడవు. అయితే.. 2-6 వారాలకు జ్వరం, గొంతునొప్పి, కురుపులు, ఒంటినొప్పులు, నోటిపూత, తలనొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గటం, నోట్లో అల్సర్లు, రాత్రిపూట చెమటలు పట్టటం, హఠాత్తుగా కీళ్లనొప్పులు, తీవ్రమైన జలుబు, గవదబిళ్లలు, కాలేయం, ప్లీహం వాచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. ఈ స్థితిలో రోగ నిరోధక శక్తిలో ముఖ్య పాత్ర వహించే సీడీ4, టి కణాలు, మాక్రోఫేజ్‌లు, మైక్రోజియల్ కణాలలోకి ఈ వైరస్ సోకి అవి నిర్వీర్యం అవుతాయి. దీంతో టీబీ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియా, విరేచనాలు, పలు చర్మరోగాల బారిన పడి అంతిమంగా మరణానికి దారితీస్తాయి.కొందరిలో చర్మ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ లాంటివీ రావచ్చు. మరి కొందరిలో జుట్టురాలడం, లింఫ్ గ్రంథుల వాపు, న్యుమోనియా, టీబీ కూడా కనిపిస్తాయి. ఎలీసా పద్ధతి ద్వారా హెచ్‌ఐవీ పరీక్ష చేస్తారు. కచ్చితమైన నిర్ధారణకు వెస్ట్రన్ బ్లాట్ టెక్నిక్ఉ, ట్రైడాట్ పరీక్ష చేస్తారు.
చికిత్స
సుఖ వ్యాధుల బాధితులకు ఇప్పుడు మెరుగైన వైద్య సదుపాయం అందుబాటులో ఉంది. ఈ చికిత్స మూలంగా రోగి యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగి తిరిగి యథాస్థితికి తీసుకురావడం వీలవుతుంది. వైద్యుల సూచనలు పాటించటం, మంచి ఆహారం, వ్యాయామ నియమాలు పాటించటం వల్ల మెరుగైన ఫలితాలు పొందొచ్చు. మానసికంగా దృఢంగా ఉండడం, యోగా సైతం ఈ సఖ్య వ్యాధుల బాధితులకు మెరుగైన రీతిలో సాయపడతాయి.
No comments:
Post a Comment