Sunday, July 26, 2020

If you ignore Pippipannu .. that's all !! | పిప్పిపన్నును నిర్లక్ష్యం చేస్తే.. ఇక అంతే సంగతులు!!

పిప్పిపన్నును నిర్లక్ష్యం చేస్తే.. ఇక అంతే సంగతులు!!

If you ignore Pippipannu .. that's all !!
పిప్పిపన్నును నిర్లక్ష్యం చేస్తే.. ఇక అంతే సంగతులు!!
ఉదయం నిద్రలేవగానే ముందు చేసేపని పళ్ళు తోముకోవటం. ఈ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో చేయనివారిలో దంతాలు గారపట్టడం, పుచ్చిపోవడం, నోటిలో పుళ్లు ఏర్పడటం వంటి మార్పులు సహజమే. చాలామంది హడావుడిగా బ్రష్ చేసేవారే తప్ప అప్పుడప్పుడూ ఆదాయంలో దంతాల పరిస్థితిని గమనించుకోరు. దీనివల్ల పిప్పి పన్నును సూచించే నల్లని మచ్చలేమైనా పళ్ళమీద కనిపిస్తే ముందుగానే దానికి తగు చికిత్స తీసుకోవచ్చు.

దశలు

పంటిమీద నల్ల మచ్చ కనిపిస్తుంటే.. పన్ను అప్పుడప్పుడే పుచ్చిపోవటం మొదలయ్యే దశ అని భావించాలి. అప్పటికీ గుర్తించకపోతే ఈ నల్లని మచ్చ స్థానంలో రంధ్రం ఏర్పడి తినే ఆహారం అందులో ఇరుక్కుపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, స్వీట్లు, పులుపు పదార్థాలు తిన్నప్పుడు ఈ నొప్పి భరించరానిదిగా ఉంటుంది. కనీసం ఈ పరిస్థితిలో దంత వైద్యుడిని కలిస్తే జింక్ ఆక్సైడ్ సిమెంట్‌గాని, సిల్వర్‌గాని నింపి పంటి లోపలి సున్నితమైన భాగాలు దెబ్బతినకుండా చూస్తారు. ఇంత జరుగుతున్నా..సమస్యను పట్టించుకోకపోతే చివరికి పన్నుపూర్తిగా పుచ్చి, దాని లోపలి సున్నితమైన నరాలు, రక్తనాళాలు బయటికీ వచ్చి బాక్టీరియా బారినపడతాయి. దీంతో తరచూ విపరీతమైన నొప్పి కలుగుతుంది.



ప్రతికూల ప్రభావాలు

కొందరు పంటినొప్పికి ఏదో ఒక బామ్‌ వాడటం, వేడినీరు లేదా వేడి ఉప్పు కాపడం పెడుతుంటారు. దీనివల్ల పంటి దగ్గర దవడ ఎముక మరింత కమిలి నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. ఇది చిగురు వాపు, దవడ లోపలి భాగంలో చీము చేరటం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. ఈ సందర్భంలో చీమును తీసేందుకు దవడకు రంధ్రం చేయాల్సి రావచ్చు. కొందరిలో ఆ చీము గొంతులోని మాగ్జిలరీ సైనస్‌లోకిపోయి మరింత ముప్పు సంభవిస్తుంది.

మరికొందరిలో పిప్పిపన్ను కింది ఎముకవద్ద చీము ఏర్పడి, పెరిగిపోయి, దవడ వాచిపోతుంది. దీన్ని వైద్యపరిభాషలో 'డెంటల్ ఏబ్బిస్' అంటారు. వాపుతో బాటు తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. ఈ దశలో దవడకు రంధ్రం చేసి చీము తీయాల్సివస్తుంది. దీనివల్ల దవడ పైన నల్లని మచ్చ శాశ్వతంగా ఏర్పడే ప్రమాదం ఉంది.

ఈ పరిస్థితులను నివారించాలంటే దంత సమస్యను మచ్చలు పడినప్పుడే గుర్తించి తగు చికిత్స తీసుకోవాలి. కాస్తఆలస్యమైనా ఆ పంటికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేసి ఆ పంటిని కాపాడుకోవచ్చు.

అపోహలు వద్దు

కొందరు పంటికి చికిత్స చేసినా, పన్ను పీకినా కంటి చూపు పోతుందని లేదా దెబ్బతింటుందని భయపడుతుంటారు. కానీ పూర్తిగా అపోహే. మెరుగైన వైద్యులు, సదుపాయాలున్న ఈ రోజుల్లో సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా చికిత్స తీసుకోవచ్చు.
కొందరు పురుగుల వల్ల పిప్పి పన్ను ఏర్పడుతుందని నమ్ముతుంటారు. కొందరు మోసగాళ్లు చెవిలో లేదా నోటిలో పసరు పోయగానే పంటిలోని పరుగులు బయట పడతాయని చెబుతారు. ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలే. పంటి దగ్గరి క్రిములు కేవలం మైక్రోస్కోప్‌లోనే కనిపిస్తాయి తప్ప వీరు చెబుతున్నట్లు కంటికి ఏమాత్రం కనిపించవు.

No comments:

Post a Comment