Sunday, July 26, 2020

If you ignore Pippipannu .. that's all !! | పిప్పిపన్నును నిర్లక్ష్యం చేస్తే.. ఇక అంతే సంగతులు!!

పిప్పిపన్నును నిర్లక్ష్యం చేస్తే.. ఇక అంతే సంగతులు!!

If you ignore Pippipannu .. that's all !!
పిప్పిపన్నును నిర్లక్ష్యం చేస్తే.. ఇక అంతే సంగతులు!!
ఉదయం నిద్రలేవగానే ముందు చేసేపని పళ్ళు తోముకోవటం. ఈ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో చేయనివారిలో దంతాలు గారపట్టడం, పుచ్చిపోవడం, నోటిలో పుళ్లు ఏర్పడటం వంటి మార్పులు సహజమే. చాలామంది హడావుడిగా బ్రష్ చేసేవారే తప్ప అప్పుడప్పుడూ ఆదాయంలో దంతాల పరిస్థితిని గమనించుకోరు. దీనివల్ల పిప్పి పన్నును సూచించే నల్లని మచ్చలేమైనా పళ్ళమీద కనిపిస్తే ముందుగానే దానికి తగు చికిత్స తీసుకోవచ్చు.

దశలు

పంటిమీద నల్ల మచ్చ కనిపిస్తుంటే.. పన్ను అప్పుడప్పుడే పుచ్చిపోవటం మొదలయ్యే దశ అని భావించాలి. అప్పటికీ గుర్తించకపోతే ఈ నల్లని మచ్చ స్థానంలో రంధ్రం ఏర్పడి తినే ఆహారం అందులో ఇరుక్కుపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, స్వీట్లు, పులుపు పదార్థాలు తిన్నప్పుడు ఈ నొప్పి భరించరానిదిగా ఉంటుంది. కనీసం ఈ పరిస్థితిలో దంత వైద్యుడిని కలిస్తే జింక్ ఆక్సైడ్ సిమెంట్‌గాని, సిల్వర్‌గాని నింపి పంటి లోపలి సున్నితమైన భాగాలు దెబ్బతినకుండా చూస్తారు. ఇంత జరుగుతున్నా..సమస్యను పట్టించుకోకపోతే చివరికి పన్నుపూర్తిగా పుచ్చి, దాని లోపలి సున్నితమైన నరాలు, రక్తనాళాలు బయటికీ వచ్చి బాక్టీరియా బారినపడతాయి. దీంతో తరచూ విపరీతమైన నొప్పి కలుగుతుంది.

Control of well-being with better treatment | మెరుగైన చికిత్సతోనే సుఖవ్యాధుల నియంత్రణ

మెరుగైన చికిత్సతోనే సుఖవ్యాధుల నియంత్రణ

Control of well-being with better treatment
మెరుగైన చికిత్సతోనే సుఖవ్యాధుల నియంత్రణ
అసురక్షిత లైంగిక చర్య మూలంగా సుఖ వ్యాధులు సంక్రమిస్తాయని మనకు తెలుసు. వీటిలో కొన్ని తక్కువ సమయంలో మందులతో నయమయ్యేవి కాగా కొన్ని దీర్ఘకాలం మందులు వాడాల్సినంత తీవ్రమైనవి. ఈ రెండో జాబితాలో ఉన్నవాటిలో హెర్పిస్, హెచ్ఐవీ లు ముఖ్యమైనవి. వీటి పట్ల సమిష్టమైన అవగాహన కలిగి ఉన్నప్పుడు ముందుగా గుర్తించటమే, వీటికి చెక్ పెట్టొచ్చు. ఇప్పటి రోజుల్లో ఈ సమస్యలకు మంచి, సంపూర్ణమైన వైద్యం అందుబాటులో ఉంది. 

హెర్పిస్

   లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు 'హెర్పిస్ సింప్లెక్స్ -2' అనే వైరస్ సంక్రమించి హెర్పిస్ కు దారితీస్తుంది. ఇది సోకిన తొలినాళ్లలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం, ఒంటి నొప్పులు, గజ్జలు, చంకలలో గడ్డలు కనిపిస్తాయి. మాలి దశలో జననాంగాలపై చిన్న చిన్న నీటిపొక్కులు ఏర్పడి, రెండు మూడు రోజుల్లోనే పగిలి రసిక కారుతుంది. ఈ సమయంలో లైంగిక చర్యలో పాల్గొంటే రెండో వారికీ హెర్పిస్ సంక్రమిస్తుంది. స్త్రీలలో ఈ సమస్య గర్భస్రావానికి, పురుషుల్లో ఆందోళన, అంగస్తంభనలకు దారితీస్తుంది. చర్మ సమస్యలూ కనిపిస్తాయి. హెచ్‌ఐవీ బాధితుల్లో హెర్పిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై లక్షణాలతో బాటు హెచ్‌ఎస్‌వీ 1, 2 పరీక్షల వంటి మరికొన్ని పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారిస్తారు.

What happens if the eyes are pierced in the same way? | అదేపనిగా కళ్లు నులిమితే..ఏమవుతుంది?

అదేపనిగా కళ్లు నులిమితే..ఏమవుతుంది?

What happens if the eyes are pierced in the same way
అదేపనిగా కళ్లు నులిమితే..ఏమవుతుంది?
కొన్నిసార్లు అలర్జీ, కాలుష్యం, పలు ఇతర కారణాల మూలంగా కళ్ళు దురద పెడుతుంటాయి. ఇలాంటి సందర్భంలో కళ్ళు నులుముకోవటం సహజమే. అయితే మరి కొందరికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకున్నా అదేపనిగా కళ్ళు నులుముకోవటం ఓ అలవాటుగా ఉంటుంది. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే కనుగుడ్డు మీది పైపొరగా ఉండే కార్నియా పల్చబడి సాగుతుంది. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'కెరటోకోనస్‌' అంటారు. ఈ సమస్యను నివారించి కంటిని తిరిగి పూర్వస్థితికి తీసుకురావటం దాదాపు ఆసాధ్యమేనని చెప్పాలి. అందుకే ఈ అంశం మీద ప్రతో ఒక్కరూ స్పష్టమైన అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం. మరీ ముఖ్యంగా కంటి అలర్జీ బాధితులు దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.

కెరటోకోనస్‌ అంటే ?

కనుగుడ్డు మీద రక్షణగా ఉండే తెల్లని 'కార్నియా' సహజమైన అద్దంలా పనిచేసి కంటి దృశ్యాలను కంటిలోని రెటీనా మీద పడేలా చేస్తుంది. పదేపదే కంటిని నులమటం వల్ల కార్నియా పొర పల్చబడి లోపలి నుంచి బయటికి తోసుకువస్తుంది. దీన్నే 'కెరటోకోనస్‌' అంటారు. ఇది సాధారణంగా 20, 30 ఏళ్ల వయసులో వస్తుంది. కనుక ఈ వయసు వారికి చూపు మసకగా ఉంటే వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కార్నియా లోపలిపొర దెబ్బతిని చూపు తగ్గిపోతుంది. జన్యుపరమైన అంశాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.

Hand hygiene is a major cause of health problems! | అనారోగ్య సమస్యలకు చేతుల అపరిశుభ్రతే ప్రధాన కారణం!

అనారోగ్య సమస్యలకు చేతుల అపరిశుభ్రతే ప్రధాన కారణం!

Hand hygiene is a major cause of health problems!
అనారోగ్య సమస్యలకు చేతుల అపరిశుభ్రతే ప్రధాన కారణం!
ఈ రోజుల్లో మనం చూస్తున్న పలు సాధారణ అనారోగ్య సమస్యలకు చేతుల అపరిశుభ్రతే ప్రధాన కారణం. ముఖ్యంగా హెపటైటిస్- ఏ, జ్వరం, జలుబు కారక సూక్ష్మ క్రిములు చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.  గనుక మనమంతా చేతుల శుభ్రతను పాటించటమే గాక పిల్లలకు ముందునుంచీ దీన్ని అలవాటు చేయాలి. ఇలా చేయగలిగితే మనం టీకా తీసుకొన్నట్టే. వ్యక్తిగత పరిశుభ్రతలో ఇంత ముఖ్యమైన అంశం పట్ల అవగాహన పెంచేందుకే ఏటా అక్టోబర్ 15 వ తేదీని 'ప్రపంచ చేతుల పరిశుభ్రత దినం'గా పాటిస్తున్న సంగతి తెలిసిందే. అందరూ దీన్ని అలవాటు చేసుకోవాలంటే కొద్దిపాటి అవగాహన, శ్రద్ధ ఉంటే చాలు.

చేతులే క్రిముల ఆవాసాలు

రోజువారీ దినచర్య ఏదైనా చేతుల సాయం ఉండాల్సిందే. తినటం, రాయటం, బరువులెత్తటం, ఇల్లు శుభ్రం చేయటం ఇలా ప్రతి పనిలోనూ చేతుల భాగస్వామ్యం ఉంటుంది. ఈ క్రమంలో ఆ పనిని బట్టి మలినాలు, సూక్ష్మ క్రిములు చేతికి అంటుకోవటం, అవే చేతులతో ఆహారం తీసుకోవటం, నీళ్లు తాగటం, ముక్కు, ముఖం తుడుచుకోవటం వల్ల శరీరంలోకి చేరతాయి. మల విసర్జన తరువాత చేతులను సబ్బుతో గాక కేవలం నీటితో కడిగి సరిపెట్టేవారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ.

What can be done to reduce the risk of stroke? | పక్షవాతం ముప్పు తగ్గాలంటే ఏమి చేయాలి?

పక్షవాతం ముప్పు తగ్గాలంటే ఏమి చేయాలి?

What can be done to reduce the risk of stroke
పక్షవాతం ముప్పు తగ్గాలంటే ఏమి చేయాలి?
మన శరీరంలో మెదడు అత్యంత కీలకమైన అవయవం. మిగిలిన అవయవాలకు జరిగినట్లే మెదడుకూ నిరంతరం రక్తప్రసరణ జరుగుతూ ఉంటుంది. అయితే  ఒక్కోసారి మెదడుకు రక్తాన్ని, పోషక పదార్థాలను సరఫరా చేసే రక్తనాళాలు హఠాత్తుగా మూసుకుపోతాయి. వైద్యపరిభాషలో దీన్నే 'స్ట్రోక్' అంటారు. సాధారణ పరిభాషలో దీనినే పక్షవాతం అనీ అంటారు. దీనివల్ల మెదడులోని ఆ భాగంలోని కణాలకు ప్రాణవాయువు అందక పోవటంతో అవి దెబ్బతినటం లేదా చనిపోవటం జరుగుతుంది. ఇలాంటి స్థితిలో తక్షణ వైద్యం అందకపోతే మరణం సైతం సంభవించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో  మూడవ ప్రధాన కారణం ఇదే. మనదేశంలో యేటా 17 లక్షల మంది దీనిబారిన పడుతుండగా వీరిలో మహిళల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య పట్ల అవగాహన పెంచేందుకు ఏటా అక్టోబర్ 29 న 'వరల్డ్ స్ట్రోక్ డే' పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Understanding is the real axis | అవగాహనే అసలైన అస్త్రం

అవగాహనే అసలైన అస్త్రం

Understanding is the real axis
అవగాహనే అసలైన అస్త్రం
శరీరపు రోగ నిరోధక శక్తిని క్షీణింపజేసే హెచ్‌ఐవి అనే వైరస్‌ మూలంగా మనిషి పలు రోగాల పాలయ్యే పరిస్థితినే ఎయిడ్స్ అంటారు. తగు చికిత్స తీసుకొనే వారికి ఇది ప్రాణాంతకమైనది కాదు. ఇది రోగం కాదు. దీన్ని కేవలం రోగ లక్షణంగానే చెప్పాలి. గతంలో మాదిరిగా దీని వాళ్ళ సంభవిస్తున్న యువజనుల మరణాలు ఇప్పుడు గణనీయంగా తగ్గటం సంతోషించాల్సిన విషయం. పెరిగిన అవగాహనే ఈ సానుకూల మార్పుకు ప్రధాన కారణం.

లక్షణాలు

  ఆరోగ్యవంతుల్లో హెచ్‌ఐవి క్రిములు ప్రవేశించిన 5-10 ఏళ్ళ వరకు సాధారణంగా ఏ లక్షణాలూ ఉండవు. రోగ నిరోధక శక్తి పెరిగే కొద్దీ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కొన్ని వారాలనుంచి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఇతర వ్యాధుల్లో కూడా కనిపించే ఈ లక్షణాలను చూసి హెచ్‌ఐవి అని తెలుసుకొనే అవకాశం చాలా తక్కువ. ఇందుకోసం పరీక్షలను ఆశ్రయించాల్సిందే. సాధారణంగా శరీరంలోని క్రిములు కొన్ని నెలలపాటు నిద్రాణంగా ఉంటాయి. ఆ సమయంలో పరీక్షలు చేయించినా పరీక్షలో తెలియకపోవచ్చు. కానీ ఈ సమయంలో వారి ద్వారా ఇతరులకు ఇది వ్యాపించే ముప్పు ఉంటుంది. హెచ్‌ఐవి క్రిములతో పోరాడటానికి శరీరపు రోగ నిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ను తయారు చేయటం మొదలైన తర్వాతే పరీక్షలో హెచ్‌ఐవి పాజిటివ్‌ అని తెలుస్తుంది.

What are the benefits of drinking water early in the morning? | ఉదయం లేవగానే నీళ్లు తాగితే ..కలిగే ప్రయోజనాలేమిటి?

ఉదయం లేవగానే నీళ్లు తాగితే ..కలిగే ప్రయోజనాలేమిటి?

What are the benefits of drinking water early in the morning
ఉదయం లేవగానే నీళ్లు తాగితే ..కలిగే ప్రయోజనాలేమిటి?
మన ఆరోగ్యం విషయంలో మంచినీరు పోషించే పాత్ర ఎంతో గొప్పది. వాహనం నడవాలంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి శరీరం పనిచేయటం కోసం మంచి నీరూ అంతే అవసరం. అందునా పరగడుపున నీళ్లు తాగటం మరింత మేలు చేస్తుంది. ఈ లావాటు మూలంగా కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకొందాం.

ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే వల్ల మల విసర్జన సులభంగా జరుగుతుంది.
పరగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు ఏరోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి.
పెద్ద పేగు శుభ్ర పడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.
రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఉపయోగపడుతుంది.
కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం.
ఉదయాన్నే అరలీటరు నీరు తాగేవారిలో జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది.
బరువు తగ్గే ప్రయత్నం చేసేవారు పొద్దున్నే నీళ్లు తాగటం ఎంతైనా అవసరం.
ఉదయాన్నే తగినంత నీరు తాగేవారి చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది.
ఉదయాన్నే నీరు తాగేవారిలో మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్ ముప్పు తక్కువ. వచ్చినా వెంటనే తగ్గుతాయి.
పరగడుపున నీళ్లు తాగటం వల్ల ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.

Ayurveda is the correct treatment for arthritis | కీళ్లనొప్పులకు ఆయుర్వేదమే కరెక్ట్ వైద్యం

కీళ్లనొప్పులకు ఆయుర్వేదమే కరెక్ట్ వైద్యం 

Ayurveda is the correct treatment for arthritis
కీళ్లనొప్పులకు ఆయుర్వేదమే కరెక్ట్ వైద్యం 
ప్రస్తుత కాలంలో యువత చిన్న వయసులోనే కీళ్ళనొప్పుల బారిన పడుతున్నారు. వేళకి భోజనం, నిద్ర లేకపోవటం, ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తినడం, పోషకాహార లోపాలు, అనారోగ్యకరమైన అలవాట్లు ఇందుకు ప్రధానకారణాలు. వీటికితోడు వ్యాయామం చేయకపోవడం, పగలు నిద్రించి రాత్రి పనిచేయటం, మానసిక ఆందోళన, కుంగుబాటు వంటివి కూడా కీళ్లనొప్పులకు కారణమవుతున్నాయి. ఒకసారి ఈ సమస్య వచ్చాక జీవితాంతం తగ్గవని అపోహపడేవారూ లేకపోలేదు. అయితే ఆయుర్వేదవైద్యంలో ఈ సమస్యకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

ఆయుర్వేదం ప్రకారం కీళ్లనొప్పులు ఎన్ని రకాలు?

ఆయుర్వేదం ప్రకారం కీళ్లనొప్పులు 3 రకాలు. వీటిలో సంధులలో వాత ప్రకోపంవల్ల వచ్చే సంధి వాతం మొదటిది. ఈ సమస్య 50- 60 ఏళ్ళ వయసువారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. కీళ్లనొప్పి, వాపు, కదిలినపుడు కీళ్లలో శబ్దం రావటం, విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గడం దీని ప్రధాన లక్షణాలు. పోషకాహారలోపంతో బాటు మధుమేహం, స్థూలకాయం, సొరియాసిస్‌ వంటి సమస్యలు, ద్విచక్రవాహనాలపై ప్రయాణించడం, అధిక బరువులు మోయడం, కంప్యూటర్స్‌ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు .