పిప్పిపన్నును నిర్లక్ష్యం చేస్తే.. ఇక అంతే సంగతులు!!
పిప్పిపన్నును నిర్లక్ష్యం చేస్తే.. ఇక అంతే సంగతులు!! |
దశలు
పంటిమీద నల్ల మచ్చ కనిపిస్తుంటే.. పన్ను అప్పుడప్పుడే పుచ్చిపోవటం మొదలయ్యే దశ అని భావించాలి. అప్పటికీ గుర్తించకపోతే ఈ నల్లని మచ్చ స్థానంలో రంధ్రం ఏర్పడి తినే ఆహారం అందులో ఇరుక్కుపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, స్వీట్లు, పులుపు పదార్థాలు తిన్నప్పుడు ఈ నొప్పి భరించరానిదిగా ఉంటుంది. కనీసం ఈ పరిస్థితిలో దంత వైద్యుడిని కలిస్తే జింక్ ఆక్సైడ్ సిమెంట్‌గాని, సిల్వర్‌గాని నింపి పంటి లోపలి సున్నితమైన భాగాలు దెబ్బతినకుండా చూస్తారు. ఇంత జరుగుతున్నా..సమస్యను పట్టించుకోకపోతే చివరికి పన్నుపూర్తిగా పుచ్చి, దాని లోపలి సున్నితమైన నరాలు, రక్తనాళాలు బయటికీ వచ్చి బాక్టీరియా బారినపడతాయి. దీంతో తరచూ విపరీతమైన నొప్పి కలుగుతుంది.