Friday, February 14, 2020

Our homemade health tips | మన ఇంట్లోనే తయారు చేసుకునే ఆరోగ్య చిట్కాలు

our-homemade-health-tips
మన ఇంట్లోనే తయారు చేసుకునే ఆరోగ్య చిట్కాలు

Our homemade health tips | మన ఇంట్లోనే తయారు చేసుకునే ఆరోగ్య చిట్కాలు

సహజంగా మనం అనారోగ్య సమస్య తలెత్తగానే చాలామంది వెంటనే చిన్న,చిన్న సమస్యలకు సైతం వైద్యుల చుట్టూ, హాస్పటల్ల చుట్టూ తిరిగుతూ బోల్డు డబ్బులు ఖర్చు చేస్తూ ఏవేవో మందులు మింగుతుంటారు. కానీ మన ఇంట్లో వున్న వాటితోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న విషయం ఎవరూ గుర్తించరు. అలాంటివాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందుతాం. ఉసిరిక పొడి, శొంఠి, పిప్పిలి, మిరియాల చూర్ణం నెయ్యి బెల్లంలో కలిపి రోజు తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. ఉసిరి కాయ రసం, నిమ్మరసం, చక్కెర కలిపి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి.



మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ పని తీరును మెరుగుపరచటంలో వేప, నేరేడు, మెంతులు, కాకర బాగా పని చేస్తాయి. కాబట్టి వీటిని ఆయా కాలాలను బట్టి ఏ రకం అందుబాటులో ఉంటే వాటిని వాడాలి. తాజాగా సేకరించటం సాధ్యంకానట్లయితే ఇవన్నీ విడివిడిగా పౌడర్లు దొరుకుతాయి. వాటిని రోజూ ఉదయం ఒక టీ స్పూను, రాత్రి ఒక టీ స్పూను చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి.

ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను అదుపు చేస్తాయి. వాటిని చేరకుండా నిరోధిస్తాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని , చర్మం మీద ముడతలు వంటి వార్ధక్య లక్షణాలను నివారిస్తుంది. ఎగ్జిమా వంటి చర్మవ్యాధులుంటే తేనె, దాల్చిన చెక్కపొడి సమపాళ్లలో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే తగ్గుతుంది. ఐదు లేదా పది మిరియాలను మెత్తగా పొడి చేసి చక్కెర లేదా నేతితో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద, నోరు అతుక్కుపోయినట్టు అవ్వడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరంల నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక టేబుల్‌ స్పూను తేనెలో అర టేబుల్‌ స్పూను అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు వదులుతుంది. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి.

ఇలా మన సమస్యలకు పరిష్కారాలకు మన ఇంట్లోనే దొరుకుతుంది. పైగా వీటి వలన మనకు ఏవిధమైన ఇతర సమస్యలకు, రోగాలకు దారి తీయవు. 

1 comment:

  1. Your Affiliate Money Printing Machine is waiting -

    Plus, getting it running is as easy as 1...2...3!

    Here is how it works...

    STEP 1. Input into the system what affiliate products you want to push
    STEP 2. Add some PUSH BUTTON TRAFFIC (it ONLY takes 2 minutes)
    STEP 3. See how the system explode your list and upsell your affiliate products all for you!

    Do you want to start making profits???

    Click here to activate the system

    ReplyDelete