Monday, February 17, 2020

Learn the benefits of drinking cumin water before dawn | పరగడుపునే జీలకర్ర నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

learn-benefits-of-drinking-cumin-water-before-dawn

Learn the benefits of drinking cumin water before dawn | పరగడుపునే జీలకర్ర నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

మనం ఉదయాన్నే జీలకర్ర బాగా నూరి వాటర్ లో కలుపుకుని త్రాగడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకి తెలిసిందే. మనం వండుకునే వంటకాలకు రుచిని, సువాసనని అందించే ఈ జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని పరగడుపునే తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వారానికోసారైనా ఇలా తాగడం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన మనం రోజు వారూ మింగే అనేక ఇంగ్లీష్ మాత్రలకు స్వస్తి పలకవచ్చని తెలుపుతున్నారు. ముందుగా జీలకర్ర వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.



  1. జీల‌క‌ర్ర నీటిని తాగితే జీర్ణాశ‌యం శుభ్ర‌పడి మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి, క‌డుపులో వికారం, క‌డుపులోని అల్సర్లు వదిలిపోతాయి. క‌డుపులో పురుగులు ఉంటే చ‌నిపోతాయి.
  2. జీల‌క‌ర్ర నీరు తాగితే మూత్రం ధారాళంగా వ‌స్తుంది. కిడ్నీరాళ్లు క‌రుగుతాయి. కిడ్నీల్లో చేరిన వ్యర్థాలు వదిలి పోతాయి.
  3. జీల‌క‌ర్ర నీటిని తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
  4. జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సుఖనిద్ర కోరుకొనే వారికి ఈ నీరు మంచి ఔషధం.
  5. బాలింతలు జీల‌క‌ర్ర నీరు తాగితే క్షీర గ్రంథులు ఉత్తేజితమై తగినన్ని చనుబాలు పడతాయి.
  6. మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  7. జీల‌క‌ర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో రక్తస‌ర‌ఫ‌రా మెరుగు ప‌డటమే గాక రక్త నాళాల్లోని అడ్డంకులు తొల‌గి గుండె స‌మ‌స్య‌లు రావు.
  8. జీలకర్రలోని స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలురోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తాయి. దీనివల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్యాలు దరిజేరవు.

కాబట్టి మిత్రులారా కనీసం వారానికి ఒకసారైనా జీలకర్ర తో తయారు చేసుకున్న రసాన్ని తీసుకోండి. పై ప్రయోజనాలను పొందండి. మీ ఆరోగ్యమే మన బ్లాగు యొక్క మహా భాగ్యం. శుభమస్త్

1 comment:

  1. Strange "water hack" burns 2lbs overnight

    At least 160,000 men and women are using a easy and secret "water hack" to burn 2lbs every night while they sleep.

    It's very easy and works every time.

    Here's how you can do it yourself:

    1) Grab a glass and fill it half the way

    2) Proceed to use this strange HACK

    and you'll be 2lbs thinner as soon as tomorrow!

    ReplyDelete