మనకి సరైన పోషకాలు అందించే ఆహారపదార్ధాలు |
Foods that provide proper nutrients! | మనకి సరైన పోషకాలు అందించే ఆహారపదార్ధాలు!
మన శరీరానికి సరైన పోషకాలను తీసుకోవటం వలన ఆరోగ్యంగా మరియు వ్యాధులకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా ప్రతి నెలలో కనీసం రెండుసార్లైనా ఆకుకూరలు, దుంపకూరలు తినాలి. ఏ సీజన్లో వచ్చిన పండ్లను ఆ సీజన్లోనే ఖచ్చితంగా తినడం వలన మనకు ప్రయోజనం ఉంటుంది. మన బాడీకి తగ్గట్టే దేవుడు ఆయా కాలాలలో తగిన పండ్లను,ఫలాలను ప్రసాదిస్తాడని మన భారతీయ ఋషులు కూడా తెలియజేశారు. ఇవన్నీ ఎందుకంటే విటమిన్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలు మన శరీరానికి తప్పక అవసరం. పచ్చని ఆకుకూరలు, హోల్ గ్రైన్స్, పండ్లు వంటి సూపర్ ఫుడ్స్ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. కొన్ని వివరాలను ఇక్కడ సూచించడం జరిగింది మరికొన్ని వివరాలు వచ్చే పోస్టులో చూద్దాం.బ్రోకలీ : బ్రోకలీ విటమిన్ 'A', 'C', కాల్షియం, ఫైబర్ లను సమృద్దిగా కలిగి ఉంటుంది. ఇది శరీర బరువును తగ్గించుటకు సహాయపడుతుంది, కేన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులను కలిగించే కారకాలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది. వండిన కూరలలో లేదా సలాడ్ లలో వీటిని కలుపుకొని రోజు తినండి.
నారంజ పండ్లు : ఇవి అధిక మొత్తంలో విటమిన్ 'C' కలిగి మరియు ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటుంది. శీతాకాలంలో నారింజ పండ్లు నయం చేసే గుణాలను కలిగి ఉంటాయి. నారింజలో ఉండే పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, మరియు కాల్షియంలు శరీరంలో అధిక రక్తపీడనం ను నియంత్రణలో ఉంచుతుంది. ఈ మూలకాలన్నీ, ఎలక్ట్రోలైట్ లను సమతుల్య పరచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
క్యారెట్ : విటమిన్ 'A', 'B', 'C', కాల్షియం మరియు పెక్టిన్ ఫైబర్ లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పదార్థాలను పెంచకుండా చూసి, శరీర బరువును నియంత్రిస్తుంది. శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగటం వలన జలుబు మరియు ఫ్లూ జ్వరాలకు దూరంగా ఉంటాము. ఎందుకంటే ఈ జ్యూస్ శరీర రోగ నిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
గుడ్లు : వారం ఏదైనా, గుడ్డు మాత్రం తినటానికి సంకోచించకండి, గుడ్డు తినకుండా ఉండుటకు కారణాలు వెతక్కుండా, రోజు గుడ్డును మీరు తినే ఆహార ప్రణాళికలో కలుపుకోండి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం మరియు వివిధ రకాల విటమిన్, మినరల్ లను సమృద్దిగా కలిగి ఉంటుంది. గుడ్డు ఎముకలను బలంగా, దృష్టిని మెరుగుపరచి, మెదడు పని తీరును కూడా పెంచుతుంది. రోజు గుడ్డు తినే వారి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
యోగ్ హార్ట్ : యోగ్ హార్ట్ పూర్తిగా కొవ్వు పదార్థాలను కలిగి ఉండకుండా, విటమిన్, కాల్షియం మరియు ప్రోటీన్ లను కలిగి ఉంటుంది. గుండె సమస్యలు, అధిక రక్తపీడనం మరియు కిడ్నీ సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని యోగ్ హార్ట్ కలిగి ఉంటుంది. యోగ్ హార్ట్ నాడులలో కొవ్వు పదార్థాల ఏర్పాటును తగ్గించి, రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది. కాల్షియం ను అధికంగా కలిగి ఉండే ఈ పదార్థం ఎముకలను బలంగా కలిగి ఉంటుంది.
If you're trying hard to lose weight then you need to try this totally brand new personalized keto plan.
ReplyDeleteTo produce this keto diet, certified nutritionists, fitness couches, and cooks united to develop keto meal plans that are effective, convenient, cost-efficient, and satisfying.
Since their launch in early 2019, 100's of clients have already remodeled their body and health with the benefits a professional keto plan can provide.
Speaking of benefits; in this link, you'll discover eight scientifically-proven ones given by the keto plan.