Saturday, February 29, 2020

Learn the benefits of garlic | వెల్లుల్లి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

learn-benefits-of-garlic
Learn the benefits of garlic

Learn the benefits of garlic | వెల్లుల్లి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

మనం సహజంగా కూరలు వండుకునేటప్పుడు తాళింపు పెట్టాలంటే తప్పనిసరిగా వెల్లుల్లి పాయ ముక్కలు ఉండాల్సిందే. ఇవి లేకుండా తాళింపును మనం ఊహించలేము. అలాగే కొన్ని కూరల్లో అల్లం,వెల్లుల్లి పేస్ట్ ఉంటే గాని ఆ కూరలకు ఎటువంటి రుచి కూడా మనకు కనిపించదు. ఇటువంటి వెల్లుల్లిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయన్నది మనకెవరికీ తెలీదు. వాటిని మనం తెలుసుకుంటే ఎప్పటికీ వెల్లుల్లిని వదిలిపెట్టం.



వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి.
ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది.
ఛాతిలో మంటను తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈస్ట్, ఫంగస్ వచ్చే ఇతరత్రా ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
వాటిని నియంత్రించేందుకు పోరాడుతుంది.
వెల్లుల్లిలోని మాంగనీసు, క్యాల్షియం, భాస్వరం, సెలినియం, విటమిన్ బి6, సిలతో అనారోగ్యాలు దరిచేరవు.

ఇందులోని శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు 150కి పైబడిన వ్యాధులతో పోరాడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.

అలాగే పాలలో వెల్లుల్లి రెబ్బల్ని ఉడకబెట్టి తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. మైగ్రేన్ తలనొప్పి తగ్గించడానికి ఈ వెల్లుల్లి పాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా నిద్ర చక్కగా పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మిత్రులారా తప్పనిసరిగా వెల్లుల్లిని మర్చిపోవద్దు. పైన చెప్పిన విధంగా వెల్లుల్లి పాయను వాడటానికి ప్రయత్నం చేయండి. అనేక పోషకాలను మన శరీరానికి అందించండి. శుభం. 

No comments:

Post a Comment