Tuesday, June 9, 2020

Learn the benefits of munaga | మునగాకు వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి.

learn-benefits-of-munaga
Learn the benefits of munaga

Learn the benefits of munaga | మునగాకు వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి.

మనం సాధారణంగా మున‌గ‌కాయ‌ల‌ను అందరు చారు,కూరగా చేసుకొని తింటూ ఉంటారు. నిజానికి మునక్కాయలను చికెన్ లో ఉపయోగించి తింటే అబ్బా ఆ రుచే వేరులెండి. తల్చుకుంటే మనకి నోరు ఊరడం ఖాయం. అయితే మున‌గ‌కాయ‌లో కాకుండా మునగాకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.వాటి గురించి తెలిస్తే ప్రతి రోజు మునగాకును తప్పకుండా తింటారు.మునగాకును పప్పుగా చేసుకోవచ్చు.అలాగే పొడిగా చేసుకొని తినవచ్చు.మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి.



మునగాకులో కాల్షియం పాలలో కన్నా 17 రేట్లు అధికంగా ఉంటుంది.మునగాకును ప్రతి రోజు తింటే ఎముకలు,దంతాలు బలంగా,దృడంగా,ఆరోగ్యంగా ఉంటాయి.అందువల్ల పెరిగే పిల్లలకు మునగాకు చాలా మంచిది.

ముంగాకులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.అందువల్ల నాన్ వెజ్ తినని వారికీ అవసరమైన ప్రోటీన్ ని మునగాకు అందిస్తుంది.

దాంతో శరీరానికి పోషణ బాగా అందుతుంది.

మునగాకులో పొటాషియం అరటిపండులో కంటే 15 రేట్లు అధికంగా ఉంటుంది.

దీనితో రక్తసరఫరా మెరుగుపడి రక్తపోటు తగ్గుతుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

ప్రతి రోజు 7 గ్రాముల మునగాకు పొడిని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గుతాయి.మునగాకులో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అందువల్ల మధుమేహం ఉన్నవారికి మునగాకు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

మునగాకులో అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన కంటికి సంబందించిన దృష్టి మాంద్యం, రేచీకటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

No comments:

Post a Comment